
మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే సేవలు
ఉమ్మడి జిల్లా డిప్యూటీ రవాణా శాఖ అధికారి వెంకటరమణ
ప్రశాంత్‌నగర్( సిద్దిపేట): మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే వాహనదారులకు నేరుగా సేవలు అందించాలని ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ రవాణా శాఖ అధికారి వెంకటరమణ అధికారులకు సూచించారు. సోమవారం సిద్దిపేట రవాణా శాఖ కార్యాల యాన్ని వెంకటరమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామ న్నారు. వాహనదారులు, ప్రజలు రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను పొందాలన్నారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కింద స్కూల్ బస్సులను తనిఖీ చేస్తు న్నామన్నారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తే వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.