
ఆయిల్‌పామ్ సాగే లక్ష్యం కావాలి
హుస్నాబాద్/కోహెడరూరల్: ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రంలోనే హుస్నాబాద్ నంబర్ వన్‌గా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని బస్వాపూర్‌లోని ముత్తన్నపేట శివారులో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్‌పామ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి లతో కలిసి ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులు ఆయిల్‌పామ్ వైపు మొగ్గు చూపాలన్నారు. జిల్లాలో మెగా పామాయిల్ ప్లాంటేషన్‌లో భాగంగా 143 ప్రాంతాల్లో 23 గ్రామాల్లో 674 ఎకరాల్లో ఆయిల్ ప్లాంటేషన్ చేయనున్నమన్నారు. కోహెడ మండలంలో ఈ ఏడాది 359 ఎకరాల లక్ష్యంగా ఉందన్నారు. ఖమ్మం తరువాత అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు సిద్దిపేట జిల్లాలోనే జరుతుందన్నారు. ఆగస్టు 15తేది లోపు సీఎం రేవంత్‌రెడ్డితో నర్మెట్టలో ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యయవసాయానికి పాధాన్యత ఇస్తోందన్నారు. ఒక ఎకరం వరి పొలానికి ఇచ్చే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయవచ్చన్నారు.
‘గౌరవెల్లి’ని పూర్తిచేసి తీరుతాం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి పొలాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రెతుకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఆయిల్‌పామ్ సాగు చేయలన్నారు. రైతుల ఆకాంక్షల కు అనుగుణంగా మంచి ధర తో ఆయిల్‌పాం కొనుగోలు చేస్తామన్నారు. హార్టికల్చర్ అధికారుల సహకారంతో సాగులో మంచి దిగుబడి వచ్చేలా చూడలన్నారు. రైతులకు అన్ని రకలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆనంతరం ఆయిల్ పాం విక్రయించిన రైతులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అద నపు కలెక్టర్ గరీమాఅగర్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీ పనులపై ఆరా
నంగునూరు(సిద్దిపేట): ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులను గురువారం మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్మెట్టలోని ఫ్యాక్టరీని పరిశీలించి పనుల పురోగతిపై జీఎం సుధాకర్‌రెడ్డితో ఆరా తీశారు. త్వరలో ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. అలాగే ఆయిల్ రిఫైనరీ పనులకు శంకుస్థాపన చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
హుస్నాబాద్ నంబర్‌వన్‌గా నిలవాలి
త్వరలోనే నర్మెట్టలో ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
బస్వాపూర్‌లో మెగా పామాయిల్ ప్లాంటేషన్