
బాధ్యతాయుతంగా పనిచేయండి
సిద్దిపేటజోన్: బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో వార్డు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా వార్డు అధికారులు తప్పనిసరి క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు. మున్సిపల్ సంబంధించిన సమస్యలు గుర్తించి సత్వరం పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పట్టణంలో ప్రతి వార్డులో ఇంటింటి చెత్త సేకరణ తప్పనిసరి సజావుగా సాగాలని సూచించారు. పట్టణ పరిశుభ్రత మన అందరి బాధ్యతగా భావించాలన్నారు. తడి, పొడి, హానికర చెత్త విభజన తప్పనిసరన్నారు. చెత్తను వేరు చేయకుండా ఇచ్చే వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ డీఈ ప్రేరణ మేనేజర్ శ్రీనివాస్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్