
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
మార్కెట్ యార్డును
సందర్శించిన అదనపు కలెక్టర్
సిద్దిపేటజోన్: స్థానిక మార్కెట్ యార్డును మంగళవారం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సందర్శించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిన విషయం తెలిసిందే.. ఈ మేరకు అదనపు కలెక్టర్ యార్డులోని రైతుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం పరిస్థితిని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం లిఫ్ట్ చేయకపోవడం తదితర సమస్యల వల్ల అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని వివరించారు. ఇప్పటికే మార్కెట్‌లో 3,500 ధాన్యం బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, లారీలు లేకపోవడంతో ధాన్యం నీటిపాలు అయిందన్నారు.
హుస్నాబాద్‌రూరల్/మద్దూరు: హుస్నాబాద్, మద్దూరు మండలాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. అలాగే వరి పంట నేలవాలి వడ్లు రాలిపోవడంతో రైతులకు తీరని నష్టం జరిగింది. గాంధీనగర్‌లో పోలు స్వామి ఇంటి పైకప్పు గాలికి కొట్టుకపోవడంతో కుటుంబానికి నీడ లేకుండా పోయింది. అలాగే మద్దూరు, దూల్మిట్ట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. కూటిగల్‌లో తూకం వేసేందుకు సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం అకాల వర్షానికి పక్కనే ఉన్న చెరువులోకి కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం