
దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్ షురూ
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో మంగళవారం దోస్త్ జిల్లా సహాయక కేంద్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిందని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. అడ్మిషన్ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే కళాశాలలోని జిల్లా సహాయ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. దోస్త్ కోఆర్డినేటర్ డా.భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు రూ.225 చెల్లించి ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. 29న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ పిట్ల దాసు, డా.శ్రద్ధానందం, సూపరింటెండెంట్ శ్రీనివాస్, దోస్త్ టెక్నికల్ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా డిగ్రీ కళాశాలలో...
సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ ఫిజిక్స్‌లో 60, లైఫ్‌సైన్స్‌లో 60, బీకాంలో 60, బీఏలో 60 సీట్లు ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటు అప్రెంటిస్ అధారిత కోర్సులైన బీకాం రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అడ్మిషన్ల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 9441136224, 9440571832 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఈ నెల 21వరకు రిజిస్ట్రేషన్లు