
సకాలంలో పరీక్షా కేంద్రాలకు రావాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నీట్ పరీక్ష రాసే విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్),బాలికల ఉన్నత పాఠశాలలోని నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు పరీక్ష హాలుకు తీసుకురావొద్దన్నారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తదితర ఏదేని ఒక గుర్తింపు కార్డును తీసుకొని రావాలని తె లిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, నీట్ పరీక్ష సిటీ కోఆర్డినేటర్ సూర్య ప్రకాశ్, పరీక్ష నిర్వహణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు
సిద్దిపేటఅర్బన్: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తేమ శాతాన్ని కొలిచి తూకం వేసి మిల్లులకు పంపించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అదనపు కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్ సలీం, మండల వ్యవసాయాధికారి శ్రీనాథ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఉన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
నీట్ పరీక్ష కేంద్రాల పరిశీలన