
మంత్రిపై విమర్శలు సరికాదు
హుస్నాబాద్: వెనుకబడిన హుస్నాబాద్‌ను అభివృద్ధి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను విమర్శిస్తే సహించేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. హుస్నాబాద్‌కు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైతే కరీంనగర్ కాంగ్రెస్ నాయకులకు కడుపు నొప్పి ఎందుకని ఆయన ప్రశ్నించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను విమర్శించారన్నారు. గతంలో కరీంనగర్‌కు వచ్చిన కళాశాలలను అప్పటి మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్‌బాబు కొండగట్టు, మంథని ప్రాంతాలకు తీసుకెళితే పొన్నం వ్యతిరేకించలేదన్నారు. త్వరలో శ్రీనివాస్‌పై టీ పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రవీందర్, ఎండీ హుస్సేన్, శ్రీనివాస్, భిక్యా నాయక్, కిష్టస్వామి, వీరన్న పాల్గొన్నారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి