
నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
బెజ్జంకి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ లబ్ధిదారులకు సూచించారు. మండలంలో దత్తత గ్రామమైన వీరాపూర్‌లో ఇండ్ల లబ్ధిదారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 400 నుంచి 600 చదరపు అడుగుల వరకు నిర్మించుకుంటే సర్కారు ఇచ్చే డబ్బులతో ఇల్లు పూర్తి చేయవచ్చని తెలిపారు. ఎక్కువ ఎస్‌ఎఫ్‌టీతో నిర్మించిన లబ్ధిదారుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బిల్లులు మంజూరు కాని వారికి త్వరలోనే వస్తాయన్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంపీఓ మంజుల, పీఆర్ ఏఈ సమ్మయ్య, ఏపీఎం నర్సయ్య, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.