
భద్రాచల దేవస్థానంలో గోటి తలంబ్రాలను అందజేస్తున్న రామకోటి రామరాజు తదితరులు
గజ్వేల్‌రూరల్: రామకోటి భక్తసమాజం ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి అన్నారు. గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్తసమాజం సిద్ధం చేసిన గోటి తలంబ్రాలను (150 కిలోల వడ్లను) సోమవారం భద్రాచలంలో దేవస్థానంలో అప్పగించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులలో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తూ రామకోటి భక్తసమాజం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
గుట్టపైకి వేంచేసిన
లక్ష్మీనృసింహుడు
బెజ్జంకి(సిద్దిపేట): లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఉత్సవమూర్తులను సోమవారం గుట్టపైకి మేలతాళాలు, కోలాటాలతో రథంపై తీసుకెళ్లారు. ఏటా బ్రహోత్సవాలకు గ్రామంలోని ఆలయం నుంచి గుట్టపైకి స్వామి వారి ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ అని అర్చకుడు మధుసూదనాచారి తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తనిఖీల్లో నగదు పట్టివేత
సిద్దిపేటకమాన్: పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కాంచీట్ చౌరస్తా సమీపంలో సీఐ, ఎస్‌ఐ నరసింహారావు, తమ సిబ్బందితో కలిసి సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా లక్ష రూపాయలు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అంతా అనుకున్నట్లుగానే..
కాంగ్రెస్‌లోకి మదన్‌రెడ్డి
నర్సాపూర్: అంతా అనుకున్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత నెల చివరి వారం నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డిని సైతం కలిసి పార్టీలో చేరే అంశంపై చర్చించారు. కాగా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించినా అవకాశం కుదరకపోవడంతో చివరికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్ చౌదరి, మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఆయన వెంట నర్సాపూర్ పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ ఎంపీపీ అధ్యక్షురాలు లలిత, ఎంపీటీసీ సంధ్యరాణి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ హబీబ్‌ఖాన్, కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ పీఎసీఎస్ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి, శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌడిపల్లి మాజీ ఎంపీపీ పద్మ, చిలప్‌చెడ్ ఎంపీపీ అధ్యక్షురాలు వినోద, కొల్చారం ఎంపీపీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సావిత్రి, హత్నూర బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డితో పాటు పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాంగ్రెస్‌లో చేరారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి తెలిపారు.

నగదును స్వాధీనం చేసుకుంటున్నవన్ టౌన్ సీఐ, పోలీసులు

ఉత్సవ మూర్తుల ఊరేగింపులో భక్తులు

మదన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్ చౌదరి