మాటల యుద్ధం! | - | Sakshi
Sakshi News home page

మాటల యుద్ధం!

Jun 30 2026 7:07 AM | Updated on Jun 30 2026 7:07 AM

సంగారెడ్డి: పట్టణంలోని పీఎస్సార్‌ గార్డెన్‌లో సోమవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్‌ వార్‌కు వేదికై ంది. ఒకే వేదికపై ఉన్న బీఆర్‌ఎస్‌కు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలారెడ్డి ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోవడంతో సభ రసాభాసగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, వృద్ధాప్య పెన్షన్‌ రూ.4 వేలకు పెంపు వంటి వాగ్దానాలు ఏమయ్యాయని నిలదీశారు. అనంతరం ఈ వ్యాఖ్యలకు నిర్మలారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ‘తవ్వుకుంటూ పోతే మీ పాత చిట్టా బయటపడుతుంది‘ అంటూ పొలిటికల్‌ పంచ్‌ వేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే, సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా.. మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే కాసేపు ఈ ఇద్దరి లీడర్ల సవాల్‌–ప్రతిసవాల్‌తో స్థానికంగా రాజకీయ వేడి రాజుకుంది.

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

సంగారెడ్డిలో ’కల్యాణలక్ష్మి’ రసాభాస

కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే

చింతా ప్రభాకర్‌ విమర్శలు

నిర్మలారెడ్డి కౌంటర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement