ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిది | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిది

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

సంగారెడ్డి: ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తొలిదశ తెలంగాణ పోరాట యోధులను వైఎస్సార్‌ భవన్‌లోని బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్‌ అధ్యక్షతన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తొలి దశ తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. తొలి దశ ఉద్యమకారులైన సుభాష్‌, సుధాకర్‌, నరసింహులు, సీతారామతీర్థం, కృష్ణారావు, జయప్రకాష్‌, శ్రీనివాస్‌, సర్జిత్‌ కౌర్‌, జయలక్ష్మిలను ఘనంగా సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కష్ణ, నాగరాణి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సాయిలు, కార్యదర్శులు సుధాకర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, పాండురంగం, శ్రీధర్‌ మహేంద్ర, మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల గౌడ్‌, మంగా గౌడ్‌ శతి గౌడ్‌, లతా, మానస, మౌనిక, వీరమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement