ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖేడ్‌లోని చారిత్రక గాంధీచౌక్‌లో సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి,జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. దీంతో పాటు కంది, పటాన్‌చెరు, జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, సంగారెడ్డి, మునిపల్లి, హత్నూర మండలాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు చౌరస్తాలు, కార్యాలయాలపై జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అలాగే పోలీస్‌స్టేషన్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల వద్ద అధికారులు, ఉపాధ్యాయులు.. పంచాయతీ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

– సాక్షినెట్‌వర్క్‌

Advertisement
 
Advertisement
Advertisement