హుండీ పగులగొట్టి చోరీ | - | Sakshi
Sakshi News home page

హుండీ పగులగొట్టి చోరీ

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

నారాయణఖేడ్‌: ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లి అందులోని నగదును చోరీ చేశారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా... వెంకటాపూర్‌ చౌరస్తా సమీపంలోని భక్తమార్కండేయ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పెకిలించి ఎత్తుకెళ్లి ఆలయం పక్కనగల వెంచర్‌లో దాన్ని పగులగొట్టారు. అనంతరం అందులోని నగదు, కానుకలను అపహరించారు. మంగళవారం ఉదయం ఆలయ కమిటీ బాధ్యులు విషయాన్ని గుర్తించారు. దాదాపు ఏడాది కాలంగా భక్తులు వేసిన రూ.లక్ష వరకు నగదు, కానుకలు చోరీకి గురయ్యాయని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా హుండీ పారవేసిన స్థలం, సీసీ ఫుటేజీని పరిశీలించారు.

వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ

జహీరాబాద్‌: మండలంలోని హుగ్గెల్లిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. రూరల్‌ ఎస్‌ఐ కాశీనాథ్‌, హుగ్గెల్లి సర్పంచ్‌ విమలారెడ్డిలు బైక్‌పై వెళ్తున్న వారికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. అనంతరం సర్పంచ్‌ విమలారెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అలాగే ఉత్తమ విద్యార్థులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement