రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రతిపక్ష నేత, మాజీముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడిని నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వి.ఆదర్శ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై దాడి అత్యంత దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు ఇది నిదర్శనమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ
ఇన్‌చార్జి వి.ఆదర్శ్‌రెడ్డి


