ప్రేమ, కరుణతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

ప్రేమ, కరుణతో మెలగాలి

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌ టౌన్‌: ప్రతీ ఒక్కరు మరొకరితో ప్రేమతో, కరుణతో ఉండాలని క్రీస్తు చెప్పిన బోధనలు అనుసరణీయమని ఎమ్మెల్యే మాణిక్‌రావు తెలిపారు. జహీరాబాద్‌ పట్టణంలో శనివారం ‘రన్‌ ఫర్‌ జీసస్‌’కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక మెథడిస్టు చర్చి సమీపంలోని స్కూల్‌ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణం వరకు చేరుకుంది. ఎమ్మెల్యే మాణిక్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరోత్తంతోపాటు జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి వందలాదిమంది క్రైస్తవులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఏసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నవారికి కౌన్సిలర్‌ స్రవంతి ఎనర్జీ డ్రింక్‌, వాటర్‌ బాటిళ్లు అందజేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ నామ రవికిరణ్‌ పాల్గొన్నారు.

రీయింబర్స్‌మెంట్‌

బకాయిలు చెల్లించాలి

ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ

సభ్యుడు సావుల ఆదిత్య

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు సావుల ఆదిత్య డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌, ఫీజురియంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు శనివారం కలెక్టరేట్‌ వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు ఆదిత్య మాట్లాడుతూ..గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా విద్యార్థులను విస్మరిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు స్కాలర్షిప్‌ ఫీజు , ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువులకు స్వస్తి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేవలం 8.2% నిధులే కేటాయించి విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement