గత మూల్యాంకన బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

గత మూల్యాంకన బకాయిలు చెల్లించాలి

Apr 4 2026 9:01 AM | Updated on Apr 4 2026 9:01 AM

నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): గత విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేసిన డబ్బులు ఉపాధ్యాయులకు చెల్లించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద మధ్యాహ్నం భోజన సమయంలో టీపీటీఎఫ్‌ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 600 మంది ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్ట్‌ల పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు. సంవత్సరం గడిచినా ఉపాధ్యాయులకు డబ్బులు రాకపోవడం శోచనీయమన్నారు. కొన్ని జిల్లాల్లో డబ్బులు చెల్లించినా, సిద్దిపేట జిల్లాలో నేటి వరకు డబ్బులు చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ నాయకులు విజయేందర్‌ రెడ్డి, సత్యనారాయణ, ఎ.రాములు, అనిల్‌ కుమార్‌, కనకయ్య, జి.రాములు, బైరారెడ్డి, అంజయ్య, యాదగిరి, శివకుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement