రైతుల కోసం నిర్మించిన రైతు బజార్‌లో ప్రైవేట్ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తోంది. భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో కూరగాయల క్రయ విక్రయాలు, ఫస్ట్ ఫ్లోర్‌లో ఫంక్షన్ హాల్, రెండవ ఫ్లోర్‌లో డైనింగ్ హాల్ నిర్మించారు. టాయిలెట్లు, వాటర్ సౌకర్యం, ఫ్యాన్లు, ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఏర్పాటు చేశారు. రైతు బజార్‌కు రైతులు ఎవరు రాకపోవడంతో పలుకుబడి ఉన్నవారు ప్రైవేట్ కార్యక్రమం కోసం వినియోగించుకుంటున్నారు. మూడు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు బజార్‌లో కనీసం మూడు రోజులు కూడా కూరగాయల క్రయ, విక్రయాలు జరగలేదు. ఈ భవనంను మున్సిపల్‌కు అప్పగిస్తే.. రైతులను రప్పిస్తామని చెబుతున్నా.. అవేమి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు బజార్‌ను అందుబాటులోకి తేవాలని, లేనిపక్షంలో ఖర్చు చేసిన నిధులు వృథా కానున్నాయి.


