బీటెక్ చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. నిరాశ చెందకుండా ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ సొంత పొలంలో 12 లక్షలతో షెడ్డు ఏర్పాటు చేసి మేకలు, గొర్రెలను పెంచుతున్నాం. కిలో రూ.450 చొప్పున కొనుగోలు దారులు షెడ్డు వద్దకే వచ్చి తీసుకెళ్తున్నారు. పెంపకం లాభదాయకంగానే ఉంది.
– సాయికుమార్,చర్లగూడెం
బ్యాంకు రుణంతో గేదెల పెంపకం
నేను డిగ్రీ చదివాను. నాతోపాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో బ్యాంకు రుణంతో 10 పాడిగేదెల పెంపకం చేపట్టా. పాలకు మంచి డిమాండ్ ఉండటంతో గిట్టుబాటు అవుతోంది. కష్టపడి పని చేస్తే పాడి పరిశ్రమలోనూ లాభం చేకూరుతుంది. – మహేందర్ గౌడ్, కాశీపూర్


