తాగిన మైకంలో, ఆస్తి పంచి ఇవ్వటం లేదనో.. కారణం ఏదైనా తల్లిదండ్రులను హత్య చేయడం.. వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. అయితే.. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమగా చూస్తున్న కుటుంబాలు సైతం ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామంలో గూడూరు సుగుణమ్మ కుమారులు, కుమార్తెలు అమ్మకు తులాభారం నిర్వహించారు. శుక్రవారం వివిధ రకాల పండ్లు, నాణేలు, బెల్లంతో తులాభారం చేశారు. అనంతరం గ్రామస్తులతో పాటు బంధువులకు భోజన కార్యక్రమం నిర్వహించారు. తమ తల్లికి ప్రేమతో తులాభారం నిర్వహించడం పట్ల వారి ప్రేమకు పలువురు అభినందించారు. ఝరాసంగం(జహీరాబాద్):
రైతులు రాని బజార్


