వ్యవసాయంపై ప్రభుత్వ తీరు మారాలి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయంపై ప్రభుత్వ తీరు మారాలి

Apr 4 2026 9:01 AM | Updated on Apr 4 2026 9:01 AM

కొండపాక(గజ్వేల్‌): వ్యవసాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు మారాలని రాష్ట్ర ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని దుద్దెడ గ్రామంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నూనె కుమార్‌, సీనియర్‌ నాయకుడు ప్రశాంత్‌ ఆధ్వర్యంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. పంటలు ఎండిపోవడానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోఓల్టేజీ విద్యుత్‌ సమస్యతో బోరుమోటార్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరం నుంచి సాగు నీటిని పంపింగ్‌ చేసి, కాలువల ద్వారా చెరువులను నింపామని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతానికి 18 గంటల త్రీ ఫేజ్‌ విద్యుత్తు సరఫరా అవుతుండగా, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అరకొరగా 14 గంటలు కూడా సరఫరా అవ్వట్లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, సర్పంచ్‌ శివకుమార్‌, నాయకులు దుర్గయ్య, శ్రీనివాస్‌, ఎల్లం, మహిపాల్‌రెడ్డి, రాజు, ఎల్లం, గోనె శ్రీనివాస్‌, రాంమ్మోహన్‌, తిరుపతి, యాదగిరి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement