కంగ్టి(నారాయణఖేడ్): చోరీ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితురాలి వద్ద నుంచి 8.3 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1.35 లక్షల నగదు, హుండీలోని మరి కొంత నగదును స్వాఽధీనం చేసున్నారు. శుక్రవారం సీఐ వెంకట్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని ఎంపల్లిలో నివాసముంటున్న ఆసం సంతోష్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పిట్లం వెళ్లాడు. కాగా నిందితురాలు మండల పరిధిలోని జమ్గి(బీ) సాధుతండాకు చెందిన వడిత్య సౌందర్య(21) రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడింది. రెండు నెలల క్రితం ఆమె సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులో అరెస్టు అయి వారం రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైంది. నిందితురాలు జులాయిగా తిరుగుతూ జల్సాలు చేస్తుంది. ఈ క్రమంలోనే గోవాకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. దీంతో డబ్బులు లేకపోవడంతో మళ్లీ చోరీకి పాల్పడింది. కాగా సీసీ ఫుటేజీ సాయంతో.. నిందితురాలిని పట్టుకున్నామని సీఐ తెలిపారు. సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై దుర్గారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్, ఎస్సై రవిగౌడ్, సిబ్బంది శైలజ, మచ్చేందర్ పాల్గొన్నారు.
బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన సీఐ


