కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

అల్లాదుర్గం(మెదక్‌): భార్యాభర్తల మధ్య గొడవతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం అల్లాదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీతానగర్‌ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జనార్దన్‌, సంగీతకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో జనార్దన్‌, భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతడు చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

నర్సాపూర్‌: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన నర్సాపూర్‌లోని 14వ వార్డులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం... పట్టణానికి చెందిన అజార్‌ఖాన్‌ రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లాడు. కాగా మంగళవారం రాత్రి దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని అల్మారాలు తెరిచి అందులో ఉన్న తులం బంగారు ఉంగరాలు, చెవి కమ్మలు, 15తులాల వెండి గొలుసులు, రూ.60వేల నగదు, పలు డాక్యుమెంట్లు సైతం ఎత్తుకుపోయారు.

తప్పిన పెను ప్రమాదం

బెజ్జంకి(సిద్దిపేట): బ్లూకోట్‌ కానిస్టేబుల్‌ అప్రమత్తతో బుధవారం విద్యుత్‌ ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా... విధి నిర్వహణ లో భాగంగా కానిస్టేబుల్‌ శ్రీను, రవి ద్విచక్ర వాహనంపై తెల్లవారుజామున వెళ్తుండగా విద్యుత్‌ పోల్‌ నుంచి తెగిపడిన వైరును గమనించారు. అనుమానం రావడంతో గ్రామపంచాయతీ ఎలక్ట్రిషియన్‌ వినోద్‌కు ఫోన్‌ చేయగా.. ఆయన వచ్చి సబ్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి విద్యుత్‌ వైరును సవరించారు. ఆ సమయంలో ఎవరూ వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్స్‌ను గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement