మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

తూప్రాన్‌: మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు కథనం ప్రకారం... పోతరాజుపల్లికి చెందిన వాకేడి శ్రీను(50) కొంత కాలంగా నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంట్లో బెడ్రూంలో చీరతో ఊరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

చికిత్స పొందుతూ ఒకరు..

వర్గల్‌(గజ్వేల్‌): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దండుపల్లిలో చోటు చేసుకుంది. బేగంపేట పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కాలకుంట్ల వినోద్‌కుమార్‌(21) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై గత నెల 24న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యానికి బానిసై వ్యక్తి ..

వర్గల్‌(గజ్వేల్‌): ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందా డు. ఈ ఘటన మండలంలోని జబ్బాపూర్‌లో చోటు చేసుకుంది. గౌరారం పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బబ్బూరి కనకరాజుగౌడ్‌(40) మద్యానికి బానిసై తెలిసిన చోట అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వారు డబ్బులు అడగడంతో వాటిని తీర్చే మార్గం తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో గత నెల 27న వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement