నర్సాపూర్: విద్యార్థులకు విద్యతో పాటు ఆయా రంగాల్లో నైపుణ్యం ముఖ్యమేనని ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ సురేశ్ అన్నారు. స్థానిక బీవీరాజు ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం నిర్వహించిన కాలేజీ 29వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్య అభ్యసిస్తూనే నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ రాజగోపాల్, సురేశ్‌తో కలిసి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన తృష్ణ ప్రాజెక్టు ఎక్స్‌పో, లేఖిని కార్యక్రమాన్ని సందర్శించి విద్యార్థులను అభినందించారు. కాగా ఆయా రంగాల్లో డాక్టరేట్ పొందిన పలువురు ప్రొఫెసర్లను, సురేశ్, రాజగోపాల్‌ను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేశ్ పాల్గొన్నారు.


