మొక్కల పెంపకానికి సిద్ధం చేయండి
డీఆర్‌డీఏ అదనపు పీడీ బాల్‌రాజు
వట్‌పల్లి(అందోల్): నర్సరీల్లో మట్టితో నింపిన బ్యాగులు సిద్ధం చేసి మొక్కలను పెంచాలని డీఆర్‌డీఏ అదనపు పీడీ బాల్‌రాజు అన్నారు. శనివారం అందోల్ మండల పరిధిలోని పోతురెడ్డిపల్లి, సంగపేట గ్రామాల్లో నర్సరీలతో పాటు ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం నాటికి మొక్కలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ మేరకు నర్సరీల్లో మొక్కల పెంపకం పనులను ప్రారంభించాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి, గుర్తించిన పనులకు సంబంధించి ఉపాధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.


