కొమురవెల్లిలో 28 ఏళ్లుగా..
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలోని పాత కమాన్ సమీపంలో 28 ఏళ్లుగా బంగారు సమ్మక్క సారలమ్మ (మినీ మేడారం) జాతర నిర్వహిస్తున్నారు. ఈ జాతరను కీర్తి శేషులు చింతల రామ్మూర్తి సమ్మక్క, సారక్క గద్దెలను ఏర్పాటు చేసి జాతరను ప్రారంభించారు. గద్దెల సమీపంలోని గుట్టనుంచి(చిలుకలగట్టు) అమ్మవార్లను రామ్మూర్తి కూతురు రేణుక తీసుకువచ్చి గద్దెకు చేర్చడం ఆనవాయితీగా వస్తుంది. మూడేళ్ల క్రితం ప్రధాన పూజారి రామ్మూర్తి మరణించడంతో ఆయన కుమారులు రాజేశ్, రాజు, భాను జాతర నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.


