ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన
ఝరాసంగం(జహీరాబాద్): జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతీయ సాంస్కృతిక నాట్య శాస్త్ర పితామహుడు భరతముని ఆరాధన ఉత్సవాలను పురస్కరించుకొని ఆశ్రమంలో హైదరాబాద్‌కు చెందిన స్వరమహా కళాపరిషత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డా.సిదేశ్వర స్వామి, ధర సిరి ఆశ్రమ పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య స్వామి, డీఎస్పీ సైదానాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాతశ్రీ అనసూయ మాత, రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాజ య్య స్వామి, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.


