అక్కెనపల్లిలో.. 32 ఏళ్లుగా..
అక్కన్నపేట(హుస్నాబాద్): జిల్లాలో సమ్మక్క–సారలమ్మ జాతర సందడి ప్రారంభమైంది. కోరికలు నెరవేరిన భక్తులు తల్లులకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తుండటంతో సందడి నెలకొంది. మండలంలోని అన్ని గ్రామాలతో పాటు మారుమూల పల్లెలు, తండాల్లో దుకాణాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కట్కూర్ గ్రామంలో శుక్రవారం సింగిల్ విండో చైర్మన్ పంజా రాజయ్యతో పాటు గ్రామ వార్డు సభ్యులు గుర్రాల వెంకన్న, వేణి కుమారస్వామి, సత్యనారాయణ తదితరులు త్రాసులో కూర్చుని తమ ఎత్తు బంగారం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇళ్లలో మేకలు, కోళ్లతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించి బంగారం పంచి పెడతారు.
నంగునూరు(సిద్దిపేట): మండలంలోని అక్కెనపల్లిలో 32 ఏళ్లుగా సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్కను గద్దెకు తెచ్చుట, శుక్రవారం అమ్మవార్లకు ఒడిబియ్యం పోసి మహిళలు ముడుపులు చెల్లించుకుంటారు. మేడారం వెళ్లలేని భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం), కోళ్లు, గొర్రెలు, మేకలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి బంధువులతో కలిసి భోజనాలు చేస్తారు.
బీజం పడింది ఇలా..
మేడారంలో జాతర జరిగే సమయంలో గ్రామ శివారులో గొర్రెల కాపరికి పసుపు ముద్దలు, కుంకుమ కనబడడంతో పూనకం వచ్చిన మహిళ సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహించాలని చెప్పింది. దీంతో గ్రామస్తులు చందాలు చేసుకొని 1994లో 14 ఎకరాల స్థలాన్ని సేకరించారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వారి మేన కోడలు లక్ష్మి, పగిడిద్దరాజు (నాగుపాము) ప్రతిమలను ప్రతిష్టించి నాటి నుంచి నేటి వరకు జాతర నిర్వహిస్తున్నారు.
జోరందుకున్న ‘బంగారం’ మొక్కులు
జాతరకు ముందు నుంచి పూర్తయ్యే వరకు నియమ, నిష్టలతో పూజలు నిర్వహిస్తాం. 32 ఏళ్ల కింద మా నాన్న శింగరయ్య ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ గద్దెలు ప్రతిష్టించారు. పూజా విధానాన్ని నాన్న ద్వారా నేర్చుకొని ఆయన తదనంతరం ఆరేళ్లుగా జాతర నిర్వహిస్తున్నా.
–దాసరి యాదగిరి, పూజారి
అక్కెనపల్లిలో.. 32 ఏళ్లుగా..
అక్కెనపల్లిలో.. 32 ఏళ్లుగా..
అక్కెనపల్లిలో.. 32 ఏళ్లుగా..


