కూటిగల్.. జిగేల్
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామం మినీ మేడారంగా ప్రసిద్ధి చెందింది. సుమారు 30 ఏళ్ల క్రితం ఊరికి దక్షిణ భాగంలోని పాటిగడ్డ లంకవనంలో సమ్మక్క–సారమ్మలు గ్రామస్తులకు దర్శనమిచ్చారు. నాటి నుంచి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం గ్రామ పెద్దల ఆలోచన మేరకు ఊరికి తూర్పు భాగాన గద్దెలను నిర్మించి సమ్మక్క –సారలమ్మలతో పాటు జంపన్న గోవిందరాజులను పునఃప్రతిష్టించారు. మేడారం నుంచి వచ్చే కోయ పూజారుల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 28 నుంచి జాతర ప్రారంభమై 31న ముగుస్తుంది. జాతరకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి భక్తులు రానున్నారు.
ఏర్పాట్లు చేశాం
సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేశాం. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నాం. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
–దాసారం బాలకృష్ణ, సర్పంచ్(కూటిగల్).
కూటిగల్.. జిగేల్


