గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకయ్య
నంగునూరు(సిద్దిపేట): సర్పంచ్‌గా గెలిచి గంగిరెద్దుల మహిళ అందరికి ఆదర్శంగా నిలిచిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిడ్డి కనకయ్య, గౌరవాధ్యక్షుడు వెంకట్ అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ముండ్రాయికి చెందిన జిడ్డి చామంతి సర్పంచ్‌గా పోటి చేసి గెలుపొందారు. బుధవారం గంగిరెద్దుల సంఘం సభ్యులు ఆమెను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంచార జాతికి చెందిన మహిళ సర్పంచ్‌గా గెలుపొందడం అభినందనీయమని, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మెండె మల్లేశం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య, వెంకటయ్య, కాసీం, మల్లయ్య, సారయ్య పాల్గొన్నారు.


