ఏకగ్రీవ సర్పంచ్‌లకు సన్మానం
చామంతిని ఆదర్శంగా తీసుకోవాలి
నారాయణఖేడ్: ఖేడ్ మండలంలో పలు గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డిని కలవగా వారిని సత్కరించారు. బుధవారం అల్లాపూర్ సర్పంచ్ లక్ష్మీబాయి, గుండుతండా సర్పంచ్ మౌనిక, ఆయా పంచాయతీల ఉప సర్పంచ్‌లుగా రామ్ శెట్టి, శంకర్ నాయక్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా కావడంతో ఖేడ్‌లో ఎమ్మెల్యే వారిని సన్మానించారు. అనంతరం వారు ఎమ్మెల్యేను సత్కరించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని వారికి సూచించారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి
సంగారెడ్డి : బీఆర్‌ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెంది, దేశానికే ఆదర్శంగా నిలిచాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇరిగిపల్లి గ్రామ సర్పంచ్ సుప్రియ, గుంతపల్లి సర్పంచ్ అనంత రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని, పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు విజేందర్ రెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు, పి.నర్సింహులు, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, సందీప్, జలంధర్, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.
ఏకగ్రీవ సర్పంచ్‌లకు సన్మానం


