డబ్బులు పంచుతున్నారని..
● ఇరు వర్గాల ఘర్షణ
● ఆరుగురికి గాయాలు
నారాయణఖేడ్ : పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ మండలంలోని జూక్కల్ శివారులో మంగళవారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాలకు చెందిన లక్ష్మిబాయి, రాజు, రవినాయక్, మారుతినాయక్, లక్ష్మణ్‌రావు, దేవిసింగ్‌లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా నిజాంపేట మండలం వెంకన్నపల్లి తండా సమీపంలోనూ అర్ధరాత్రి సమయంలో డబ్బులు పంచడానికి వచ్చారని ఓ వర్గం వారి కారుపై మరో వర్గం దాడి చేయడంతో అద్దాలు పగిలిపోయాయి.


