విద్యుదాఘాతంతో హార్వెస్టర్ డ్రైవర్ మృతి
మృతుడు రాజక్కపేట వాసి
దుబ్బాకరూరల్: విద్యుదాఘాతంతో మండలానికి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో చనిపోయాడు. వివరాలు ఇలా... దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కొర్వి యాదగిరి(25) హార్వెస్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వరి కోత సీజన్ కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాడు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం, ఇసుకత్రిపుర గ్రామంలో పొలంలో వరి కోస్తున్నాడు. ఈ క్రమంలో హార్వెస్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. యాదగిరి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాచాయలు అలుముకున్నాయి.


