ఓఆర్‌ఆర్ డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు
ఇద్దరికీ తీవ్ర గాయాలు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ సర్కిల్ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్‌రోడ్డుపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. కొల్లూరు ఇన్‌స్పెక్టర్ గణేశ్ వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా మల్లంపేటకు చెందిన నర్సింహులు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా ఉరవకొండకు వెళ్లాడు. ఆదివారం ఓటు వేసి సోమవారం మల్లంపేటకు తిరిగి ప్రయాణమయ్యాడు. సాయంత్రం కొల్లూరు రింగ్‌రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఇరుక్కుంది. ఈ సంఘటనలో నర్సింహులు, శ్రవంతికి తీవ్రగాలయ్యాయి. స్వాతి, కళ్యాణి, ఆంజనేయులుతో పాటు ముగ్గురు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.


