దశదినకర్మకు వెళ్లి.. అనంతలోకాలకు..
ఇమాంపూర్‌లో ఘటన
తూప్రాన్: దశదినకర్మకు వెళ్లి చెరువులో స్నానం చేసేందుకు దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతై శవమై తేలాడు. ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఇమాంపూర్ గ్రామానికి చెందిన బక్క సంతోష్‌గౌడ్ (55) తూప్రాన్ పట్టణంలో నివసిస్తున్నారు. ఇమాంపూర్‌లో బంధువుల్లో ఒకరు మృతి చెందగా విషయం తెలుసుకొని ఈ నెల 13న శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దశదినకర్మకు వెళ్లారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని చెరువులో స్నానం చేస్తుండగా సంతోష్‌గౌడ్ గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం చెరువులో తేలాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.


