చేగుంట సర్పంచ్‌గా స్రవంతి
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రమైన చేగుంట గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దాదాపు ఐదు వేల ఓట్ల లెక్కింపు కోసం నాలుగు రౌండ్లు టేబుల్‌ను ఏర్పాటు చేయగా రాత్రి 12 గంటలకు నాలుగో రౌండు లెక్కింపు ముగిసే సరికి సండ్రుగు స్రవంతికి 1683 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి దుంపల రమ్యకు 1648 ఓట్లు వచ్చాయి. దీంతో 35 ఓట్ల ఽఆధిక్యంతో స్రవంతి సర్పంచ్‌గా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో ఉపసర్పంచు ఎన్నిక వాయిదా పడగా సోమవారం ఉపసర్పంచు కోసం నిర్వహించిన సమావేశంలో వార్డుమెంబర్లు ఏకతాటిపైకి రాకపోవడంతో మళ్లీ ఎన్నిక వాయిదా వేశారు.


