ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో ప్రమాదం
● లాడల్ పేలి ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం ● పరిశ్రమ ఎదుట కార్మికుల ఆందోళన
మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమలో లాడల్ పేలి ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాపాయ పరిస్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని చెట్లగౌరారంలో గల ఎంఎస్ స్టీల్ పరిశ్రమలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శరాన్షు కుమార్ విశ్వకర్మ (35), రాజేశ్‌పాండే ఎప్పటిలాగే పరిశ్రమలో క్రేన్‌ను నడిపిస్తున్నారు. విధుల్లో భాగంగా క్రేన్ నడుపుతూ లాడల్(కరిగించిన ద్రావణాన్ని మోసే పెద్ద బకెట్)ను పక్కకు తరలిస్తున్న సమయంలో అది అదుపుతప్పి బట్టిపై పడటంతో పెద్ద శబ్దంతో పేలింది. దీంతో క్రేన్‌పై పని చేస్తున్న శరాన్షుకుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన రాజేశ్ పాండేను చికిత్స కోసం మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా లాడల్ పేలడంతో భారీ శబ్దంతోపాటు వచ్చిన పొగలతో గ్రామస్తులు, కార్మికులు ఉలిక్కిపడ్డారు. గ్రామంలో పరిశ్రమ చుట్టు పక్కల ఇళ్లు అదరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పరిశ్రమ వద్ద కార్మికుల ఆందోళన
విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కార్మికులు పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, కార్మికులకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యాజమాన్యంతో మాట్లాడిస్తామని చెప్పినా కార్మికులు వినకుండా ఆందోళన కొనసాగించారు. ఆర్డీఓ జయచంద్రారెడ్డి, పరిశ్రమల మేనేజర్ ప్రకాశ్, తహసీల్దార్ ఆంజనేయులు, తూప్రాన్ సీఐ రంగాకృష్ణ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అనంతరం కార్మికులతో చర్చలు జరిపారు.
ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో ప్రమాదం
ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో ప్రమాదం


