గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు
సంగారెడ్డి టౌన్: గంజాయి కేసులో నలుగురికి సంగారెడ్డి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, జరిమాన విధించింది. వివరాలు ఇలా... 2019లో 160 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి తరలిస్తున్న పోలగోని నిఖిల్, పవర్ శ్రీనివాస్, పవర్ సంతోష్, రాథోడ్ శ్రీకాంత్‌లను అరెస్ట్ చేశారు. సీఐలు మోహన్ కుమార్, రమేశ్ రెడ్డి, ఎస్సైలు రాజు, కేఎం విశ్వనాథులు నిందితులను సంగారెడ్డి ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. సీఐ మధుబాబు కేసు నమోదు చేసి, సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం కోర్టు నలుగురికి పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమాన విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
వృద్ధుడికి తీవ్ర గాయాలు
హత్నూర( సంగారెడ్డి): షార్ట్‌సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమై, వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని మాధుర గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... తలారి నర్సయ్య ఇంటి ఎదుట ఉన్న పూరిగుడిసెలో ఎప్పటిలాగే భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమైంది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో పక్క ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబీకులు, స్థానికులు ఒక్కసారిగా నరసయ్యను మంటల్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. మంటలు అదుపు చేసి, వెంటనే క్షతగాత్రుడిని అంబులెన్‌న్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదులోని ఉస్మానియాకు తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు.
గుర్తుతెలియని
మృతదేహం లభ్యం
చేగుంట(తూప్రాన్): గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మండల కేంద్రమైన చేగుంటలోని బాలాజీ వెంచర్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రైల్వే స్టేషన్ రోడ్డులోని బాలాజీ వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతుడి వివరాల కోసం ప్రయత్నించగా ఎలాంటి వివరాలు లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం
సంగారెడ్డి క్రైమ్: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడంతో నిత్యం ప్రయాణికులతో పాటు విద్యార్థులకు ఫుట్‌బోర్డు ప్రయాణం తప్పడం లేదని వాపోతున్నారు. సంగారెడ్డి నుంచి జోగిపేట్ వెళ్లే ప్రధాన మార్గంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్‌లో బస్సులు ఒకేసారి లేదంటే గంటల కొద్ది ఆలస్యంగా రావడంతో విద్యార్థులకు ప్రమాదకర ప్రయాణం తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కాలేజీ సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తుండటంతో ఏమాత్రం పట్టుజారినా ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు పరిస్థితులకు అనుగుణంగా బస్సులు సమయపాలన పాటించాలని విద్యార్థులు కోరుతున్నారు.
గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు


