చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
చేగుంట(తూప్రాన్): చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కర్నాల్‌పల్లి గ్రామానికి చెందిన చింతాకుల యశోద మూర్ఛ వ్యాధితో బాధపడుతుంది. ఎంతకూ తన వ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపం చెందిన యశోద ఈనెల 10న వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నర్సాపూర్ మండలానికి చెందిన వ్యక్తి..
నర్సాపూర్ రూరల్: పాముకాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని జక్కపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సంగయ్యపేట రమేశ్ (42) నవంబర్ 25వ తేదీన పొలం వద్ద పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు రమేశ్‌ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ సూరారంలోని నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య మాధవి, పిల్లలు ఉన్నారు.
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి


