సంతానం కలగడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): సంతానం కలుగడం లేదన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల పరిధిలోని రాజ్‌పేట తండాలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బానోత్ భాస్కర్ భార్య శ్రీదేవి(33) సంతానం కోసం పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు శ్రీదేవిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్ పేర్కొన్నారు.
పురుగుల మందు తాగి..
హవేళిఘణాపూర్(మెదక్): పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని జక్కన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి రాజు(42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పొలం వద్దకు వెళ్తానని చెప్పిన రాజు ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే మెదక్ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య


