ఆకతాయిల ఆగడాలు
● గురువన్నపేట పాఠశాలలోవస్తువులు ధ్వంసం ● సందర్శించిన కలెక్టర్ హైమావతి
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని గురువన్నపేట ఉన్నత పాఠశాలలోని వస్తువులను ఆదివారం సెలవురోజు కావడంతో గుర్తు తెలియని ఆకతాయిలు మరుగుదొడ్ల డోర్లు, ఎలక్ట్రీసిటి మీటర్, వైర్,నల్లాలు ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్‌కు తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ హైమావతి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సామగ్రిని ఎవరు ధ్వంసం చేశారని ఉపాధ్యాయులతో కలిసి ఆరా తీశారు. తక్షణమే ధ్వంసమైన సామగ్రిని అమర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. సామగ్రి ధ్వంసం చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఫోన్‌లో ఆదేశించారు. అలాగే వెంటనే పాఠశాలకు ప్రహరిగోడ నిర్మాణానికి నిధులు మంజూరి చేస్తామని, పాఠశాలలోని ఎలక్ట్రీసిటి వస్తులు గదిలో ఉండే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఆకతాయిల ఆగడాలు


