టోల్ ప్లాజా వద్ద నిలిచిన వాహనాలు
కొండపాక(గజ్వేల్): మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో కొన్ని మండలాల్లో రెండో విడత ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, తదితర పట్టణాల నుంచి సిద్దిపేట తదితర గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి హైదరాబాద్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు టోల్ ప్లాజా వద్ద భారీగా క్యూ కట్టాయి. దీంతో టోల్ ప్లాజా నిర్వాహకులు హైదరాబాద్ వైపు ట్రాఫిక్ జాంను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్లేందుకు ఉన్న నాలుగు వరుసల్లో ఒక వరుసను హైదరాబాద్ వైపునకు వెళ్లేలా లైన్ క్లియర్ చేయడంతో ట్రాఫిక్ అదుపులోకి వచ్చింది.


