కాళ్లు మొక్కి .. ఓటు అభ్యర్థించి..
కొల్చారం(నర్సాపూర్): మండలంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్ల వద్దకు వెళ్లి చేతులు పట్టుకొని ఇవి చేతులు కావు కాళ్లు అనుకోండి అనే బదులు.. ఏకంగా కలిసిన వారి కాళ్లు పట్టుకొని ఓటు అడుగుతున్నారు. గెలుపు కోసం ఎందాకై నా వెళ్తామన్న ఈ దృశ్యం మండలంలోని సంగాయిపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోష్కే సులోచన దంపతులు ఇలా ప్రచారం చేశారు.


