ఎమ్మెల్సీకి సీతారాముల తలంబ్రాలు
గజ్వేల్‌రూరల్: భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహిత రామకోటి రామరాజు ఆదివారం భద్రాచల దేవస్థాన శ్రీరామరక్ష స్తోత్ర పుస్తకాలతో పాటు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ... వేలాది మంది భక్తులతో గోటి తలంబ్రాలు తయారు చేయించి భద్రాచల సీతారాముల కల్యాణోత్సవం తర్వాత తిరిగి వాటిని భక్తులకు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.


