డెత్ డేగా మారిన బర్త్ డే
కొండపాక(గజ్వేల్): పుట్టినరోజు వేడుకల్లో భాగంగా స్నేహితులను కలిసేందుకు వెళ్తున్న యువకుడు కానిరాని లోకాలకు వెళ్లాడు. దీంతో కుకునూరుపల్లి మండలంలోని తిప్పారం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు... గ్రామానికి చెందిన బోగి శ్యామల, నర్సింహులు దంపతుల చిన్న కుమారుడు నవీన్ శుక్రవారం కుటుంబీకులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి చిన్ననాటి స్నేహితులతో కలిసి ముందస్తుగా బర్త్‌డే సెలబ్రేషన్‌ను జరుపుకొని, ఇతరులను కలిసేందుకు కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ములుగు పోలీస్టేషన్ శివారులో రాజీవ్ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎగిరి అవతలి ప్రక్కన పడింది. ఈ ప్రమాదంలో నవీన్‌కు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. శుక్రవారం స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తిప్పారంలో విషాదఛాయలు


