ఒకరి బైండోవర్
: రూ.లక్ష జరిమానా
మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ వ్యక్తిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు మిరుదొడ్డి ఎస్‌ఐ సమత శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని మల్లుపల్లికి చెందిన గరిపల్లి లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటిపై గత నవంబర్ నెల 29న దాడి నిర్వహించగా అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని పట్టుకుని అదే రోజు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు వివరించారు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో అక్రమంగా మద్యం విక్రయించడం మళ్లీ మొదలు పెట్టాడని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఈ నెల 5న అతని ఇంటిపై దాడి చేసి మరింత మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితున్ని శుక్రవారం తసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేయగా రూ. లక్ష జరిమానా విధించారన్నారు.
పౌష్టికాహారంతో ఆరోగ్యం
నర్సాపూర్: పౌష్టికాహారంతో ఆరోగ్యం పొందవచ్చని జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. శుక్రవారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సాంఘిక సంక్షేమ డేను పురస్కరించుకొని మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదస్సులో కమిటీ ప్రతినిధులు మధుశ్రీ, స్వరూపరాణి, సుధాకర్, ఆసుపత్రి వైద్యులు పావని, రాజేష్ తదితరులు పాల్గొని రోగులకు పలు సూచనలు చేశారు.
గ్యాస్ సిలిండర్ లీకై ..
గుడిసె దగ్ధం
చిన్నశంకరంపేట(మెదక్): గ్యాస్ సిలిండర్ లీకై పూరి గుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన నార్సింగి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. నార్సింగి మండల కేంద్రానికి చెందిన మానేపల్లి రవి కుటుంబ సభ్యులతో కలిసి పూరిగుడిసెలో జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం గ్యాస్‌సిలింగర్ రెగ్యులేటర్ నుంచి మంటలు వ్యాపించి పూరిగుడిసెకు అంటుకున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఇరుగు, పొరుగు సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మంటల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కాగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన రూ.2.50లక్షలు, మరో రూ.పదివేలు, తులం బంగారు ఆభరణాలు, సర్టిఫికెట్లు, ఇంటి పేపర్లు దగ్ధమైనట్లు బాధితుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సృజన తెలిపారు.
అక్రమ మద్యం స్వాధీనం
సిద్దిపేటకమాన్: అక్రమంగా రవాణ చేస్తున్న మద్యాన్ని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నికల కోడ్ సందర్భంగా పలు గ్రామాల్లో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. తనికీల్లో అక్రమంగా తరలిస్తున్న 21.96లీటర్ల లిక్కర్, 3.25లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకుని ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఒకరి బైండోవర్


