ముందు 7.. రీకౌంటింగ్ తర్వాత 2
రేగోడ్(మెదక్): మండలంలోని తాటిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక హోరాహోరీగా జరిగింది. గ్రామంలో 617 ఓట్లు ఉండగా, ఇండిపెండెంట్‌గా కవిత, కాంగ్రెస్ తరపున సంపూర్ణ పోటీ చేశారు. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కవిత 7 ఓట్ల మెజార్టీతో గెలిచారని అధికారులు ముందుగా ప్రకటించారు. తరువాత కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుదారులు రీకౌంటింగ్ చేయించడంతో ముందుగా 7 ఓట్లు మెజార్టీ ఉన్న కవిత.. చివరకు 2 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. గ్రామాభివృద్ధే తన లక్ష్యమని సర్పంచ్ కవిత తెలిపారు.
నాలుగోసారి
ఒకే కుటుంబానికి సర్పంచ్ గిరి
అల్లాదుర్గం(మెదక్): రిజర్వేషన్ కలిసిరావటంతో వరుసగా నాలుగోసారి ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి వరించింది. అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి పంచాయతీ 2006 నుంచి 2025 వరకు వరుసగా నాలుగు సార్లు రిజర్వేషన్ జనరల్‌కే కేటాయించారు. గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో సాతెల్లిగారి నర్సింహారెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు. ఈ కుటుంబానికే నాలుగోసారి సర్పంచ్ పదవి దక్కడం విశేషం.
సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు
అస్పత్రికి తరలింపు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జంగరాయి సర్పంచ్ అభ్యర్థి ఆర్.అంజిరెడ్డి గుండెపోటుతో అస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి గ్రామంలో ప్రచారం ముగించుకొని ఇంటికి చేరిన సంజీవరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో అనుచరులతో ఎన్నికల గురించి చర్చిస్తున్న క్రమంలో చాతీలో నొప్పి వస్తుందని కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కోతుల దాడిలో
మహిళకు గాయాలు
శివ్వంపేట(నర్సాపూర్): కోతుల దాడిలో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని చిన్న గొట్టిముక్కుల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రకళ ఇంటి ఆరుబయట పనులు చేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చి దాడి చేశాయి. ఆమె అరవడంతో స్థానికులు కోతుల మందను తరిమేశారు. కోతుల దాడిలో చంద్రకళకు చేతులతో పాటు పలు చోట్ల గాయాలయ్యియి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు.
ముందు 7.. రీకౌంటింగ్ తర్వాత 2
ముందు 7.. రీకౌంటింగ్ తర్వాత 2


