చిన్నమల్లారెడ్డిలో ఒకరి ఆత్మహత్య
రీ కౌంటింగ్ జరిపించాలి
కలెక్టర్‌కు గంగాపూర్ గ్రామస్తుల ఫిర్యాదు
మర్కూక్ (గజ్వెల్): మర్కుక్ మండలం గంగాపూర్ యూసుఫ్‌ఖాన్ పల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికను నిలిపివేయాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటును లెక్కించి కౌంటింగ్ నిర్వహించాలని ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జంపల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో లక్ష్మి, శ్యామలకు 194 చొప్పున ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేయాలని అభ్యర్థులు అధికారులకు సూచించినా పట్టించుకోవడం లేదు. దీంతో ఇరువురి మధ్య డ్రా తీస్తున్నామని ఎవరికి వస్తే వారు గెలిచినట్లు అవుతుందని అధికారులు ప్రకటించారు. అధికారులు తీసిన డ్రాలో శ్యామలకు విజయం వరించింది. దీన్ని మరో అభ్యర్థి లక్ష్మి అభ్యంతరం తెలిపారు. ఇదిలా ఉండగా బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ ఉద్యోగికి సంబంధిత అధికారులు ఈనెల ఆరో తేదీన ఓట్లను పంపించారు. 9న ఓట్లు స్పీడ్ పోస్టులో చేరాయి. 11న ఎన్నికలు ముగిసే సమయానికి పోస్టల్ ఓటు చేరుకోలేదు. 12న మధ్యాహ్నం 12 గంటలకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయానికి పోస్టు ద్వారా వచ్చాయి. ఈ విషయంలో తిరిగి పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఓట్లను లెక్కించి న్యాయం చేయాలని లక్ష్మి డిమాండ్ చేశారు.
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ రంజిత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేటకు చెందిన ఇబ్రహీం(35)కు బాన్సువాడకు చెందిన ఓ మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు రావడంతో కొంతకాలంగా భార్య పిల్లలను తీసుకొని తల్లిగారింట్లో ఉంటోంది. దీంతో ఇబ్రహీం కొంతకాలంగా తన అమ్మమ్మ గ్రామమైన చిన్న మల్లారెడ్డిలో ఉంటూ ప్రైవేటుగా మెకానిక్ పనులు చేస్తున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని కొద్దిరోజులుగా అతడు మనస్తాపానికి గురవుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అతడు జీవితంపై విరక్తి చెంది చిన్నమల్లారెడ్డిలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గుర్తించి, అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


