పంచాయతీ సిబ్బందిపై హోంగార్డు దాడి
మద్దూరు(హుస్నాబాద్): పంచాయతీ సిబ్బందిపై దాడిచేసిన హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేశారు. స్థానిక చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుడు బాలేశ్ నల్లా పైపుతో కార్యాలయ ఆవరణలోని చెట్లకు నీరు పడుతుండగా చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించే భానుచందర్ అక్కడి వచ్చి తన కారు కడుక్కోడానికి నల్లా పైపు ఇవ్వాలని అడిగారు. ఐదు నిముషాల తర్వాత ఇస్తానని బాలేశ్ చెప్పడంతో ఆయన కోపంతో దాడికి దిగారు. పక్కనే ఉన్న మరో సిబ్బంది హోంగార్డును ఆపేందుకు ప్రయత్నించగా, అతనిపైనా దాడి చేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీఓ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు.
చర్యలు తీసకోవాలంటూ నిరసన


