1200 మంది పోలీసులు
రెండో
విడతకు
సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఆదివారం నుంచి జరిగే రెండో విడత ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రెండో విడత ఎన్నికలకు 1200 మంది పోలీసు అధికారులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే విధి నిర్వహణలో ఉన్న అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలనీ, సొంత నిర్ణయాలు తీసుకోరాదని వెల్లడించారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లోపటిష్ట బందోబస్తు: ఎస్పీ పరితోష్ పంకజ్


